Saturday 3rd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తెలుగు వారి ‘బ్లూ బుల్లెట్’ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు!

తెలుగు వారి ‘బ్లూ బుల్లెట్’ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు!

  • అర్ధ శతాబ్ద ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు!

Telangana Express Completes 50 Years తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశ రాజధాని న్యూదిల్లీతో అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ రైలు నేటితో విజయవంతంగా 50 వసంతాలను (గోల్డెన్ జూబ్లీ) పూర్తి చేసుకుంది. 1976 అక్టోబరు 3న ప్రారంభమైన ఈ రైలు, ఐదు దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. తెలుగు ప్రజలకు దిల్లీ ప్రయాణం అనగానే ముందుగా గుర్తుకువచ్చే రైలు ఇదే.

‘బ్లూ బుల్లెట్’ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా..

1976 అక్టోబర్ 3న నాటి ఉమ్మడి ఏపీ సీఎం జలగం వెంగళ్‌‌రావు, రైల్వే మంత్రి మధు దంతావతే చేతుల మీదుగా ‘ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌‌ప్రెస్’ పేరిట ఈ రైలు ప్రయాణం మొదలైంది. అప్పట్లో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలుకు ఉన్న ఆక్స్‌ఫర్డ్ బ్లూ, బంగారు రంగుల కారణంగా ప్రయాణికులు, రైల్వే ప్రేమికులు దీనిని ‘బ్లూ బుల్లెట్’ అని పిలుచుకునేవారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం వచ్చిన డిమాండ్ల మేరకు 2015 నవంబరు 15న ఈ రైలు పేరును అధికారికంగా ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా మార్చారు.

అనాడు 23 గంటల్లోనే దిల్లీకి..

ప్రారంభంలో సింగిల్ లైన్, పాత సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ సికింద్రాబాద్ నుంచి దిల్లీకి కేవలం 23 గంటల్లోపే చేర్చేది. ప్రస్తుతం 16 స్టాప్‌లతో 1,677 కిలోమీటర్ల దూరాన్ని 26 గంటల 30 నిమిషాల్లో చేరుస్తోంది. 1976 లో డీజిల్ ఇంజిన్‌తో కేవలం 14 కోచ్‌లతో ప్రయాణం ప్రారంభమైంది. 1981లో ప్రయాణికుల రద్దీ వల్ల ట్విన్ డీజిల్ ఇంజిన్‌తో 21 కోచ్‌లకు పెంచారు. లాలాగూడ లోకో షెడ్‌కు చెందిన శక్తివంతమైన విద్యుత్ ఇంజిన్‌‌తో 24 కోచ్‌లతో నడుస్తోంది.

You may also like
నాతో పెట్టుకోకు.. కేటీఆర్ విమర్శలకుకవిత సంచలన కౌంటర్!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల!
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions