Mukesh Ambani And Nita Ambani Meets Donald Trump | అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump )జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు మరియు ప్రతినిధులు హాజరవనున్నారు.
ఈ క్రమంలో వాషింగ్టన్ ( Washington ) లో ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ ( Candlelight Dinner ) లో భారత ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ మరియు ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. సుమారు 100మంది వరకు ఈ డిన్నర్ లో పాల్గొనగా ఇండియా నుండి అంబానీ దంపతులు ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంబానీ దంపతులు జనవరి 18నే అమెరికాకు వెళ్లారు. డిన్నర్ సందర్భంగా ట్రంప్ తో అంబానీ భేటీ అయినట్లు రిలియాన్స్ ఫౌండేషన్ పేర్కొంది. ట్రంప్ నాయకత్వంలో భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడుతాయని ఆశిస్తున్నట్లు రిలియాన్స్ తెలిపింది.
కాగా ట్రంప్ తో అంబానీ దంపతులు దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ భేటీలో ఏం చర్చించారో అనేది మాత్రం బయటకు రాలేదు.