Saturday 3rd October 2026
12:07:03 PM
Home > తాజా > సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని!

సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని!

Rachita Ram Birthday Incident సౌత్ సినీ పరిశ్రమలో తనదైన అందం, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్‌కు (Rachita Ram) తన పుట్టినరోజు వేడుకల్లో ఓ అనుకోని వింత అనుభవం ఎదురైంది. అక్టోబర్ 3న తన బర్త్‌డే సందర్భంగా అభిమానులను కలిసి సెల్ఫీలు ఇస్తున్న సమయంలో, ఓ అభిమాని ఊహించని రీతిలో ఆమె వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి రెండు బుగ్గలను గిల్లి అక్కడి నుంచి పారిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

అసహనం ప్రదర్శించని డింపుల్ క్వీన్..

పుట్టినరోజు నాడు అభిమానులను కలవడం రచితా రామ్‌కు ఆనవాయితీ. అయితే ఈసారి ఓ వ్యక్తి సెల్ఫీ దిగిన తర్వాత మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి, వెనువెంటనే ఎవరూ ఊహించని విధంగా ఆమె రెండు బుగ్గలను పట్టుకుని గిల్లి పారిపోయాడు. భద్రతా సిబ్బంది ఉన్నా క్షణాల్లో జరగడంతో ఆపలేకపోయారు. ఈ అనుకోని పరిణామంతో రచితా రామ్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా, ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా చిరునవ్వుతో మిగతా అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ వేడుకలను కొనసాగించారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

అభిమానం పేరుతో తారల వ్యక్తిగత పరిధిని దాటడం, అనుమతి లేకుండా అలా తాకడం ఆమోదయోగ్యం కాదని, సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

చిరంజీవి ‘కాకా’ చిత్రంలో కీలక పాత్ర..

ప్రఖ్యాత భరతనాట్య కళాకారుడు కె.ఎస్. రాము కుమార్తె అయిన బిందియా రాము (రచితా రామ్) ‘బుల్‌బుల్’ చిత్రంతో శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. తమిళంలో రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో విలన్ ఛాయలున్న పాత్రలో మెప్పించిన ఆమె, తెలుగులో ‘సూపర్ మచ్చి’తో అడుగుపెట్టారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘కాకా’ లో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

https://twitter.com/newstamil24x7/status/2106305133659513272/video/2

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions