Saturday 6th December 2025
12:07:03 PM
Home > క్రీడలు > భారత్ ఓటమి..15 ఏళ్ల తర్వాత సఫారీల

భారత్ ఓటమి..15 ఏళ్ల తర్వాత సఫారీల

India vs South Africa-1st Test | కోల్కత్తలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన భారత్-సౌత్ ఆఫ్రికా టెస్టు మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయింది. సఫారీల బౌలింగ్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనమిది వికెట్లు తీసిన సైమన్ హర్మర్ టీం ఇండియా టాప్ ఆర్డర్ ను కూల్చాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు భారత గడ్డపై టెస్టు మ్యాచులో విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్ లో 159, సెకండ్ ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది. టీం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 189 పరుగులు చేసింది. 124 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ కు వచ్చిన టీం ఇండియా వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ 26, జడేజా 18, ధృవ్ జురేల్ 13 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో గాయం కారణంగా మైదానాన్ని వీడిన కెప్టెన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు.

రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఎనమిది వికెట్లు తీసిన హర్మర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇకపోతే ఈ విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో సఫారీ జట్టు ఐదో స్థానం నుండి సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. ఇకపోతే ఈ ఓటమితో మూడవ స్థానంలో ఉన్న టీం ఇండియా నాలుగవ స్థానంలోకి పడిపోయింది.

You may also like
’10 నిమిషాల డెలివరీ దౌర్జన్యంను ముగించాలి’
సర్పంచ్ బరిలో ఎమ్మెల్యే భార్య..ఆ గ్రామంలో నామినేషన్
‘సీఎం మోసం..బీసీ యువకుడి ప్రాణం బలైంది’
‘నా కూతురికి సానిటరీ ప్యాడ్ కావాలి..రక్తం వస్తుంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions