Anil Ravipudi About IT Rides On Dil Raju | తెలుగు సినీ ప్రముఖుల నివాసం, కార్యాలయాలపై గత కొన్నిరోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెల్సిందే.
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసి ఛైర్మన్ దిల్ రాజ్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా మరియు దర్శకుడు సుకుమార్ ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఈ అంశంపై తాజగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. గురువారం ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ ఐటీ రైడ్స్ తో బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారా అని ఓ జర్నలిస్టు సరదాగా ప్రశ్నించారు.
అయితే దిల్ రాజ్ బాధలో ఏమి లేరని, ఆయన ఒక్కనిపైనే సోదాలు జరగడం లేదని అనిల్ రావిపూడి చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని టైటిల్ పెట్టాం కదా, ఐటీ అధికారులు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో అంటూ అనిల్ రావిపూడి నవ్వులు పూయించారు.
ప్రతీ రెండు మూడేళ్లకు ఓ సారి ఐటీ రైడ్స్ జరగడం సర్వసాధారణం విషయమన్నారు. తాను వచ్చినా రాకపోయినా సినిమా ప్రమోషన్స్ అపొద్దని దిల్ రాజే చెప్పారని దర్శకుడు పేర్కొన్నారు.