Chiranjeevi And Pawan Kalyan Extends Birthday Wishes To Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి, సోదర సమానులు అయిన లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ డిప్యూటీ సీఎం పోస్ట్ చేశారు. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో లోకేశ్ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
మరోవైపు లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే నారా లోకేశ్ కృషి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన తపన హర్షణీయం అని చిరు కొనియాడారు. లోకేశ్ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి.