Janhvi Kapoor Wants To Settle In Tirupati | పెళ్ళైన అనంతరం భర్త తాను తమ ముగ్గురు పిల్లలతో తిరుమల తిరుపతిలో నివసించాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్ ( Bollywood ) నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నటి జాన్వీ కపూర్ కు తిరుమల తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఉంది. తన పుట్టినరోజున మరియు తల్లి శ్రీదేవి ( Sridevi ) జయంతి రోజున ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
ఇదిలా ఉండగా పెళ్ళైన తర్వాత యాక్టింగ్ కెరీర్ కు ముగింపు పలికి తనకు తిరుపతిలో సెటిల్ ( Settle ) అవ్వాలని ఉన్నట్లు చెప్పారు. వివాహం కూడా తిరుపతిలోనే చేసుకోవాలని తన మనసులోని మాటను వెలిబుచ్చింది.
అనంతరం ముగ్గురి పిల్లలతో తిరుపతిలో రోజూ అరటి ఆకులో భోజనం చేస్తూ..గోవిందా గోవిందా నామస్మరణం వింటూ ఉండాలని ఉందన్నారు. అంతేకాకుండా మణిరత్నం సంగీతం వింటూ కూర్చోవాలని తన ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి జాన్వీ కపూర్ తెలిపారు.
ఈ మేరకు నిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో నటి జాన్వీ కపూర్ ఈ కామెంట్స్ చేశారు.