Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కంగనా వ్యాఖ్యలపై సోనూ సూద్ ఫైర్..

కంగనా వ్యాఖ్యలపై సోనూ సూద్ ఫైర్..

Sonu Sood on Kangana Ranaut Comments | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జంతర్‌మంతర్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న జెన్-జీ యువతను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

నిరసనకారులను “గట్టర్ జనరేషన్”గా సంబోధించిన కంగనా, వారి సోషల్ మీడియా రీల్స్ “వాంతులు తెప్పించేలా ఉన్నాయి” అంటూ విమర్శించారు. అంతేకాకుండా, యువత తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీయగా, ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ వ్యవహారంపై స్పందించారు.

కంగనా నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది అత్యంత సిగ్గుచేటని అన్నారు. యువతే నటులను, రాజకీయ నాయకులను ప్రజల్లో నిలబెడుతుందని, వారిని కించపరిచేలా మాట్లాడకూడదని హితవు పలికారు.

“యువత మన వెన్నంటి ఉన్నంత కాలమే మన ఎదుగుదల ఉంటుంది. ప్రజలే దేవుళ్లు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. వారు లేకపోతే మనకు గుర్తింపు ఉండదు. వృత్తి ఏదైనా ప్రజలతో కలిసి ఉండాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి” అని సోనూ సూద్ పేర్కొన్నారు.

ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు, వాటిపై సోనూ సూద్ స్పందన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇరువురి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

You may also like
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు!
kangana ranauth
‘బొద్దింకలు’ అన్నప్పుడు ‘గట్టర్’ అనడంలో తప్పేంటి? కంగనా రనౌత్!
ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన 15 ఏళ్ల బాలిక!
నిర్భయంగా పనిచేయండి.. నాదే బాధ్యత.. సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions