Hyd Traffic Diversions | సికింద్రాబాద్‌లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఈ ఉత్సవాలు ఆగస్టు 2 నుంచి 4 వరకు జరుగనున్నాయి.
ఆగస్టు 2 అర్ధరాత్రి 12 గంటల నుంచి ట్రాఫిక్ నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ఆగస్టు 4 తెల్లవారుజామున 3 గంటల వరకు లేదా ఉత్సవాలు ముగిసే వరకు కొనసాగుతాయి.
దేవాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, ప్యారడైజ్, సీటీఓ జంక్షన్, ప్లాజా, ఎస్బీఐ క్రాస్‌రోడ్స్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, పట్నీ, పార్క్ లేన్, బాటా, ఘాస్మండి, బైబిల్ హౌస్, మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
టొబాకో బజార్, హమాలి విగ్రహం నుంచి ఆలయానికి వెళ్లే రహదారులు మూసివేస్తారు. బాటా క్రాస్‌రోడ్స్ నుంచి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్‌ను కూడా తాత్కాలికంగా మూసివేస్తారు. హిల్ స్ట్రీట్ నుంచి అడవయ్య క్రాస్‌రోడ్స్ మీదుగా ఆలయానికి వెళ్లే మార్గంలో కూడా వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
ఎస్బీఐ క్రాస్‌రోడ్స్, ప్యారడైజ్, బైబిల్ హౌస్, సీటీఓ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే నడుస్తాయి.
భక్తుల సౌకర్యార్థం హరి హర కళాభవన్, మహబూబ్ కళాశాల, సీఎంఆర్ షాపింగ్ మాల్, పాత జైల్ ఖానా మైదానం, ఇస్లామియా హైస్కూల్, అడవయ్య మెమోరియల్ హైస్కూల్, నల్లగుట్ట జీహెచ్ఎంసీ గ్రౌండ్, వెస్లీ కాలేజ్, జిమ్ఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్‌కు సంబంధించిన సహాయం కోసం 9010203626 నంబర్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.









