Anandhi Ajay Emotional | అభిమాన స్టార్ హీరో సినిమాలో ఒక చిన్న పాత్ర దక్కినా ఏడాదంతా శ్రమించిన ఒక నటి, చివరి క్షణంలో ఎడిటింగ్‌లో ఆ సీన్లు ఎగిరిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం నుంచి తన సన్నివేశాలను తొలగించడంపై తమిళ నటి ఆనంది అజయ్ సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ప్రాజెక్ట్ కోసం తాను దాదాపు సంవత్సరం పాటు కష్టపడ్డానని ఆమె తెలిపారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కారణంగా ఇదే ఆయన చివరి సినిమా కావచ్చనే ప్రచారం ఉండటంతో, మళ్లీ ఆయనతో నటించే అవకాశం జీవితంలో రాదని తీవ్ర నిరాశ చెందారు.
ఆనంది ఆవేదనను చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ‘కార్తిగై పెంగళ్’ సీరియల్, ‘జోడీ నెం.1’ డ్యాన్స్ షోల ద్వారా గుర్తింపు పొందిన ఆనందికి, ఈ చేదు అనుభవం ఎదురైనప్పటికీ నెటిజన్ల నుంచి లభిస్తున్న మద్దతు ఊరటనిస్తోంది.







