Thursday 22nd October 2026
12:07:03 PM
Home > తాజా > దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు!

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు!

  • కేవలం 4 రోజుల్లో రూ.755 కోట్లు!

Telangana Dasara Liquor Sales తెలంగాణలో దసరా పండుగ సంబరాలు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ పండుగ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాయి. పండుగకు ముందు కేవలం నాలుగు పనిదినాల్లోనే ఏకంగా రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే పండుగ సమయంలో నమోదైన రూ.698 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఈసారి అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఒక్కరోజే రూ.303 కోట్లు:

పండుగ సీజన్‌లో మద్యం విక్రయాలు అంచనాలను మించిపోయాయి. ముఖ్యంగా పండుగకు ముందురోజైన అక్టోబర్ 19న ఒక్కరోజే అత్యధికంగా రూ.303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం. అక్టోబర్ 14న రూ.102.17 కోట్లు, 16న రూ.126.32 కోట్లు, 17న రూ.223.25 కోట్లు, 19న రూ.303.40 కోట్ల చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి. (15, 18 తేదీల్లో డిపోలకు సెలవు కావడంతో ఆ రెండు రోజులు మినహాయించి ఈ గణాంకాలు నమోదయ్యాయి).

బీర్లదే హవా..

ఎప్పటిలాగే ఈ పండుగ సీజన్‌లోనూ బీర్ల జోరు కొనసాగింది. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 10.44 లక్షల కేసుల బీర్లు, 6.83 లక్షల కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడయ్యాయి. మొత్తం విక్రయాలు రూ.2,055 కోట్లు: ఈ భారీ అమ్మకాలతో అక్టోబర్ 19 నాటికే ఈ నెలలో మొత్తం మద్యం విక్రయాల విలువ రూ.2,055 కోట్లకు చేరుకుంది. పండుగ సీజన్ కావడంతో ఈ నెల చివరి నాటికి విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 17 డిపోల ద్వారా 2,620 వైన్‌షాపులు, 1,113 బార్ అండ్ రెస్టారెంట్లు మరియు ఇతర క్లబ్బులు, పబ్బులకు నిరంతరం మద్యం సరఫరా జరుగుతోంది.

You may also like
కేటీఆర్ గడ్డం పెంచడానికి కారణం అదే.. ఎంపీ అర్వింద్ ఎద్దేవా!
tgsrtc
‘మహాలక్ష్మి’ కి నీరాజనాలు: 3 నెలల్లో 97.20 లక్షల మంది మహిళల ప్రయాణం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!
కాంగ్రెస్‌కు మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈసీపై నిందలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions