Monday 5th October 2026
12:07:03 PM
Home > తాజా > ‘మహాలక్ష్మి’ కి నీరాజనాలు: 3 నెలల్లో 97.20 లక్షల మంది మహిళల ప్రయాణం

‘మహాలక్ష్మి’ కి నీరాజనాలు: 3 నెలల్లో 97.20 లక్షల మంది మహిళల ప్రయాణం

tgsrtc

TGSRTC Mahalakshmi Free Bus Scheme తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాలక్ష్మి” ఉచిత బస్సు ప్రయాణ పథకానికి రాష్ట్రంలోని మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గత ఏడాదితో (2025) పోలిస్తే ఈ ఏడాది (2026) జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉచిత ప్రయాణం వినియోగించుకున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వెల్లడించింది. గత మూడు నెలల కాలంలోనే అదనంగా 97.20 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.

ప్రయాణికుల సంఖ్య పెరుగుదల..

2025 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 34.67 కోట్ల (3,467.91 లక్షలు) మంది మహిళలు ప్రయాణించగా, 2026 నాటికి ఈ సంఖ్య 35.65 కోట్లకు (3,565.11 లక్షలు) చేరింది. మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగినందున ప్రధాన అంతర్ జిల్లా, రాజధాని కనెక్టివిటీ మార్గాల్లో ప్రత్యేకంగా ట్రిప్పుల సంఖ్యను ఆర్టీసీ పెంచింది.

కీలక రూట్లు ఇవే…

ఖమ్మం–ఇల్లందు, కరీంనగర్–హన్మకొండ, సిద్దిపేట–JBS, బాన్సువాడ–నిజామాబాద్, నాగర్‌కర్నూల్–హైదరాబాద్, నల్గొండ–సూర్యాపేట తదితర రూట్లలో సర్వీసులను విస్తరించారు.

ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది: నాగిరెడ్డి

“మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి మహిళా క్షేత్రస్థాయిలో డిపో మేనేజర్లు, అధికారులు రద్దీ పరిస్థితులను సమీక్షిస్తూ అదనపు ట్రిప్పులు వేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్లలో కూడా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సర్వీసులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం” అని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.

You may also like
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!
కాంగ్రెస్‌కు మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈసీపై నిందలు!
vc sajjanar
వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు: వీసీ సజ్జనార్
cm revanth inaugurates olectra electric car
ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions