Saturday 7th September 2024
12:07:03 PM
Home > తాజా > మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరోయిన్.. ఎవరంటే!

మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరోయిన్.. ఎవరంటే!

Chiranjeevi

Young Heroine In Viswambhara | మెగాస్టార్ చిరంజీవి-బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం ఇదే. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. నాని జెంటిల్‌మన్ చిత్రంలో మెరిసిన యంగ్ హీరోయిన్ సురభి కూడా విశ్వంభరలో నటిస్తున్నట్లు సమాచారం.

అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. యూనిట్ నుంచి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో హర్షవర్ధన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌లు కూడా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  

You may also like
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించనున్న కర్ణాటక ఎమ్మెల్యే
jr ntr
Jr. NTRకి ప్రమాదం.. ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీం!
allu arjun
అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన మెగా హీరో.. సోషల్ మీడియా లో రచ్చ!
Hema
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions