- బీజేపీ శ్రేణుల్లో నిరాశ!
Amit Shah Telangana Visit Cancelled కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక రోజు పర్యటన నిమిత్తం రేపు తెలంగాణకు రావాల్సి ఉండగా, ఆయన పర్యటన ఆకస్మికంగా రద్దయింది. చివరి నిమిషంలో ఈ పర్యటనను రద్దు చేసుకోవడానికి గల కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, లోక్‌భవన్‌లో బస చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది.
పర్యటన కోసం మెదక్, కరీంనగర్ జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.
పర్యటన రద్దుకు కారణం?
ఢిల్లీలో చోటుచేసుకున్న అత్యవసర పరిణామాలు లేదా ఇతర అనివార్య కారణాల వల్లే హోంమంత్రి తన పర్యటనను రద్దు చేసుకుని ఉండవచ్చని తెలంగాణ బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. పర్యటన రద్దు కావడంపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అమిత్ షా మళ్లీ తెలంగాణకు ఎప్పుడు వస్తారనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.











