Saturday 3rd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ!

‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ!

  • మద్దతు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!

Rahul Gandhi Satyagraha Platform దేశవ్యాప్తంగా విభిన్న సమస్యలపై పోరాడుతున్న ప్రజలు, ఉద్యమకారుల గొంతుకలను ఒకే చోటికి చేర్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘సత్యాగ్రహ’ (Satyagraha) పేరుతో డిజిటల్ వేదికను ప్రారంభించారు. దేశంలో సత్యం అణచివేతకు గురవుతున్న సమయంలో, పోరాడుతున్న ప్రజల గళాన్ని వినిపించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు తెలుపుతూ, ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

ఒకే మ్యాప్‌‌లో దేశవ్యాప్త పోరాటాలు..

భూమి, మహిళల హక్కులు, దళితులు, ఓబీసీల హక్కులు, విద్య, పరీక్షల అక్రమాలు వంటి వివిధ అంశాలపై దేశంలో జరుగుతున్న నిరసనలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. బాధితులు, ఉద్యమకారులు వెబ్‌సైట్‌ను సందర్శించి, నిర్దేశిత ఫారమ్‌‌లో వివరాలు నింపడం ద్వారా తమ పోరాటాలను జాతీయ స్థాయిలో నమోదు చేసుకోవచ్చు. “బాపూజీ మనకు సత్యమే గొప్ప ఆయుధమని చెప్పారు. కానీ సత్యం పక్షాన అంతా కలిసికట్టుగా నిలబడటమే అంతకంటే పెద్ద ఆయుధం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..

కాంగ్రెస్ నేతృత్వంలోని సత్యాగ్రహ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “మీ గళాన్ని మేం వింటాం, మీతో కనెక్ట్ అవుతాం. సత్యం, న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌ను సందర్శించి మీ ఉద్యమ వివరాలను నమోదు చేయండి” అని పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో విడివిడిగా జరుగుతున్న స్థానిక పోరాటాలను ఒకే తాటిపైకి తెచ్చి, వాటికి జాతీయ స్థాయిలో గుర్తింపు మరియు బలమైన మద్దతు అందించడమే ఈ వెబ్‌సైట్ యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

You may also like
ఈ భవనం పేదలకు నమ్మకం కలిగించాలి: సీఎం రేవంత్!
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
వందేమాతరం వివాదం: సోనియా, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు!
ఏఐసీసీ ఆఫీసులో వందేమాతరం వివాదం.. సోనియా, రాహుల్ హావభావాలపై బీజేపీ ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions