Tuesday 11th August 2026
12:07:03 PM
Home > తాజా > చిరును క్షమాపణ కోరిన ఆర్జీవి

చిరును క్షమాపణ కోరిన ఆర్జీవి

Ram Gopal Varma Apologizes to Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు కోరారు. ఆర్జీవి, అక్కినేని నాగార్జున కాంబోలో వచ్చిన ‘శివ’ 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘శివ’ సినిమా ప్రాముఖ్యతను, టాలీవుడ్ పై అది చూపిన ప్రభావాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు.

శివ సినిమా ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్ అని కొనియాడారు. తొలిసారి శివ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. చైన్ లాగే సీన్ ఎప్పటికీ తనకు గుర్తిండి పోతుందన్నారు. రాంగోపాల్ వర్మ తెలుగు సినీ పరిశ్రమకు భవిష్యత్తు అని తనకు అప్పుడే అర్ధం అయ్యిందన్నారు చిరంజీవి. ఈ క్రమంలో చిరంజీవి వీడియోపై ఆర్జీవి స్పందించారు.

‘ధన్యవాదాలు చిరంజీవి గారూ, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు’ అని తెలిపారు. అయితే క్షమాపణలు కోరాడానికి కారణం మాత్రం చెప్పలేదు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions