Raghunandan Rao Counter To Jagan | తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంపై దుమారం రేగుతున్న తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ శనివారం తిరుమల వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దైంది.
అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో డిక్లరేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణలోని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ డిక్లరేషన్ వివాదంపై వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ తిరుమల వెళ్తానంటే బీజేపీ అడ్డుకోలేదన్నారు.
డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేక జగన్ బీజేపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అన్యమతస్తులు దేవాలయాల్లోకి వెళితే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని రాజ్యాంగంలోనే ఉందని రఘునందన్ రావు గుర్తు చేశారు. మసీదులోకి వెళ్తే టోపీ, కర్చీఫ్ పెట్టుకుంటున్నారని, అలాంటప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలి కదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.