Tuesday 21st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్!

‘నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్!

Bandla Ganesh Angry Counter To Prakash Raj | టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్ చేసిన ఒక పోస్ట్‌ పై గణేశ్ ఘాటుగా స్పందిస్తూ నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఎంట్రీపై, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన సంచలన పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది.

ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు..
పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన, రాజకీయ వ్యూహాలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఈ కామెంట్స్ మెగా అభిమానులకు, జనసేన శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై బండ్ల గణేశ్ ఏమాత్రం తగ్గకుండా అత్యంత తీవ్రమైన పదజాలంతో కౌంటర్ ఇచ్చారు.  “నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి?” అని గణేశ్ నిలదీశారు.

 ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే అంటూ మండిపడ్డారు.

“నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!” అంటూ బండ్ల గణేశ్ గట్టి చురకలు అంటించారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్సెస్ జనసేన పొలిటికల్ వార్‌గా మారిన ఈ ఇద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

You may also like
‘ఆ గదిలో మగవాళ్లు కూర్చుని రాస్తే అంతే..’
‘పెద్ది’ బాక్సాఫీస్ సునామీ.. రామ్‌చరణ్ యాక్టింగ్‌కు ఐకాన్ స్టార్ ఫిదా!
‘పెద్ది’ హీరోయిన్ సీన్లపై వివాదం.. సారీ చెప్పిన బుచ్చిబాబు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions