Karnataka MLA To Act With Chiranjeevi | కర్ణాటక ( Karnataka )కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ( Congress MLA ) మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )తో కలిసి నటించనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇదే విషయంపై చిక్కబళ్లాపుర ( Chikkaballapur ) ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ( Pradeep Eshwar )మాట్లాడారు. చిరంజీవితో కలిసి నటించే అవకాశం రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తాను చిరంజీవికి పెద్ద అభిమానినని పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం చిరంజీవి తన హైదరాబాద్ ( Hyderabad )నివాసానికి పిలిచి సన్మానించినట్లు గుర్తుచేశారు.
అలాగే ఏపీ ఎన్నికల్లో జనసేన ఘన విజయం పట్ల పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు.
ప్రస్తుతం చిరంజీవి ‘ విశ్వంభర ‘ ( Vishwambhara ) సినిమా చేస్తున్నారని, ఈ మూవీ తర్వాత మొదలయ్యే మరో మూవీలో మెగాస్టార్ తో కలసి తాను నటించనున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనేది త్వరలోనే తెలుస్తుందన్నారు.