Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ లో రెడ్ అలెర్ట్..కమీషనర్ కీలక సూచన

హైదరాబాద్ లో రెడ్ అలెర్ట్..కమీషనర్ కీలక సూచన

Amrapali reddy kata

Red Alert For Hyderabad | హైదరాబాద్ ( Hyderabad ) లో రెండు రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దింతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లో రెడ్ అలెర్ట్ ( RED ALERT ) ప్రకటించిన క్రమంలో జిహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి ( GHMC Commissioner Amrapali ) కీలక సూచనలు చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ అయిన దృష్ట్యా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కమీషనర్ అభ్యర్దించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.

అలాగే పిల్లలను, వృద్ధులను ఒంటరిగా రోడ్లపై నడవనివ్వవద్దని సూచించారు. జలమయమయిన రోడ్లపై వాహనదారులు, పదాచారులు జాగ్రత్త వహించాలన్నారు.

హైదరాబాద్ సురక్షితంగా ఉండేందుకు జిహెచ్ఎంసీ అప్రమత్తంగా మరియు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర లేదా సమస్య ఎదురైనప్పుడు దయచేసి 040 21111111 లేదా 9000113667 కి కాల్ చేయాలని కమీషనర్ కోరారు.

You may also like
Hydrabad Rains
Rain Alert: రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!
nv subhash
పిల్లల ప్రాణాలను మింగేయటమేనా తెలంగాణ మోడల్ : NV Subhash

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions