Friday 4th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కారుతో డెలివరీ బాయ్ ని ఢీకొట్టి..దౌర్జన్యం చేసిన వ్యక్తి

కారుతో డెలివరీ బాయ్ ని ఢీకొట్టి..దౌర్జన్యం చేసిన వ్యక్తి

Gajuwaka Delivery Boy | గాజువాక ( Gajuwaka ) లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజలకు నిత్యావసరాలు అందిస్తున్న ఓ డెలివరీ బాయ్ ( Delivery Boy ) ని కారుతో ఢీ కొట్టి దౌర్జన్యం చేశాడు ఓ వ్యక్తి.

గాజువాకలో భారీ వర్షంలోను ఓ డెలివరీ బాయ్ పార్సెల్లను తీసుకొని రోడ్డుపై వెళ్తున్నాడు. ఇంతలోనే ఓ వ్యక్తి వెనుకనుండి వచ్చి బైక్ ( Bike ) ని ఢీ కొట్టాడు. దింతో సదరు డెలివరీ బాయ్ కిందపడిపోయాడు.

అయినప్పటికీ ఏ మాత్రం సానుభూతి చూపకుండా కారులో నుండి దిగిన వ్యక్తి తాను సబ్ ఇన్స్పెక్టర్ ( Sub Inspector )అంటూ రెచ్చిపోయాడు. డెలివరీ చేయాల్సిన వస్తువులను పక్కకు విసిరేసి, డెలివరీ బాయ్ ను హెచ్చరించాడు.

తోటి వాహనదారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా తాను సబ్ ఇన్స్పెక్టర్ అంటూ దాబాయించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

డెలివరీ బాయ్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ( Netizens )దౌర్జన్యం చేసిన సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
Muslim Family
గణేశ్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు.. కేటీఆర్ ప్రశంసలు!
వినాయకుడి లడ్డూ దొంగలున్నారు జాగ్రత్త
కోపంతో ఓలా షో రూమ్ ను తగలపెట్టిన కస్టమర్
నల్గొండ జిల్లా పంట పొలాల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions