Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీహార్ ఎన్నికలు..ఎంఐఎం తరఫున రాజపుత్ అభ్యర్థి

బీహార్ ఎన్నికలు..ఎంఐఎం తరఫున రాజపుత్ అభ్యర్థి

Owaisi’s ‘Rajput’ Pick Rana Ranjit Singh | బీహార్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దాఖా నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు రాజపుత్ వర్గానికి చెందిన రాణా రంజిత్ సింగ్. ధాఖా నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ.

అయితే ఈ స్థానంలో ఎంఐఎం తరఫున హిందూ-రాజపుత్ అభ్యర్థి బరిలోకి దిగడం ఆసక్తిగా మారింది. తాజగా రంజిత్ సింగ్ నామినేషన్ లోనూ భిన్నంగా కనిపించారు. తలపై నమాజ్ టోపి ధరించి నుదుటన తిలకం పెట్టుకున్నారు. తాను ‘ఐ లవ్ మహమ్మద్’, ‘జై శ్రీరామ్’ రెండు నినాదాలను విశ్వసిస్తానని పేర్కొన్నారు. ఎలాంటి పాదరక్షలు లేకుండా ర్యాలీగా బయలుదేరిన ఆయన ఎంఐఎం పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.

హిందు-ముస్లిం అంటూ మతాల మధ్య విభజన తెస్తూ ఇతర పార్టీలు చేస్తున్న రాజకీయాలు దేశానికి క్యాన్సర్ వంటివని, తాను ఓ వ్యాక్సిన్ లా గాంధేయ మార్గంలో మత విద్వేష రోగాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తానని రాణా రంజిత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా రంజిత్ సింగ్ సోదరుడు రణధీర్ సింగ్ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. తండ్రి సీతారాం సింగ్ కూడా మాజీ మంత్రే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions