Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నక్సలిజం నిర్మూలనే లక్ష్యం..అమిత్ షా కీలక పోస్ట్

నక్సలిజం నిర్మూలనే లక్ష్యం..అమిత్ షా కీలక పోస్ట్

258 Naxalites Surrender in Two Days: Union Home Minister Amit Shah | వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా కనుమరుగు అవుతుందని మరోసారి ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వరుసగా మావోయిస్టు అగ్ర నాయకులు లొంగిపోతున్న తరుణంలో అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

‘ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మర్ మరియు ఉత్తర బస్తర్, ఒకప్పుడు నక్సల్ ఉగ్రవాద కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు. ఇప్పుడు నక్సల్స్ నుండి పూర్తిగా విముక్తి పొందాయని ప్రకటించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఇప్పుడు దక్షిణ బస్తర్‌లో మాత్రమే నక్సలిజం యొక్క జాడ మిగిలి ఉంది. దీనిని కూడా మన భద్రతా దళాలు త్వరలోనే నిర్మూలిస్తాయి. 2024 జనవరి నుండి, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2100 మంది నక్సలైట్లు లొంగిపోయారు, 1785 మందిని అరెస్టు చేశారు, మరియు 477 మందిని నిర్మూలించబడ్డారు. ఈ సంఖ్యలు 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే గట్టి సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయి’ అని అమిత్ షా పేర్కొన్నారు.

గురువారం 170 మంది, బుధవారం 17 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ లో పోలీసుల ముందు లోగిపోయారని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మాల్లోజుల నేతృత్వంలో 61 మంది మావోయిస్టులు సీఎం ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసి పోయిన విషయాన్ని షా ప్రస్తావించారు. ఆయుధాలు వీడి, భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి జన జీవన స్రవంతిలోకి వచ్చిన వారిని కేంద్రమంత్రి అభినందించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions