Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > అంధ యువ సింగర్ ను సత్కరించిన సజ్జనర్

అంధ యువ సింగర్ ను సత్కరించిన సజ్జనర్

RTC MD Sajjanar Meets Viral Blind Singer | బస్సులో వెళ్తూ ఓ అంధ యువకుడు పాడిన పాట ప్రస్తుతం తెగ వైరల్ ( Viral ) గా మారింది. రామ రామ రఘురామ అంటూ అతడు ఆలపించిన పాట హృదయాలను హద్దుకుంది.

ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ( RTC MD Sajjanar ) సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే నేరుగా యువ గాయకుడు రాజుని కలిసి సత్కరించారు.

‘ దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నారు గాయకుడు రాజు. మధురమైన గాత్రమే కాదు.. పాట‌కు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా త‌న చేతులు, కాళ్ల‌తో సంగీతాన్ని అందిస్తోన్న ఈయన ప్రతిభ అద్భుతం. ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. ‘ అని ఈ సందర్భంగా సజ్జనర్ పేర్కొన్నారు.

అనంతరం రాజుని శాలువాతో సత్కరించి అభినందించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions