Saturday 2nd May 2026
12:07:03 PM
Home > తాజా > గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!

గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!

gaddar film awards

Gaddar Film Awards 2025 | తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం 2024 ఏడాదికిగానూ గద్దర్ అవార్డులను (Gaddar Film Awards) ప్రకటించింది.

ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుల్ని, బెస్ట్ టెక్నీషియన్లను ప్రకటించింది. ఈ అవార్డుల కమిటీ జ్యూరీ చైర్మన్ జయసుధ గురువారం నాడు ఈ అవార్డుల జాబితాను ప్రకటించారు. ఈ అవార్డుల్లో కల్కి (Kalki), పొట్టేల్ (Pottel), లక్కీ భాస్కర్(Lucky Bhaskar) చిత్రాలు వరుసగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్నాయి.

ఉత్తమ సామాజిక చిత్రంగా కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu), ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kadu), ఉత్తమ హెరిటేజ్ చిత్రంగా రజాకార్ (Razakar) సినిమాలు నిలిచాయి. కల్కీ (Kalki 2898 AD) చిత్రానికి గానూ నాగ్ అశ్విన్ ఉత్తమ దర్శకుడి అవార్డు సొంతం చేసుకున్నారు.

కమిటీ కుర్రోళ్లు సినిమాకు యదు వంశీ (Yadu Vamsi) ఉత్తమ నూతన దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇక ప్రభంజనం సృష్టించిన పుష్ప 2(Pushpa 2) చిత్రానికి గానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఉత్తమ నటుడిగా నిలిచారు. 35 చిన్న కథ కాదు సినిమాకు నివేదా థామస్(Niveda Thamos) ఉత్తమ నటిగా నిలిచారు.

రజాకార్ సినిమాకు గానూ భీమ్స్ ఉత్తమ బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. సిద్ శ్రీరామ్ బెస్ట్ మేల్ సింగర్, శ్రేయా ఘోషాల్ బెస్ట్ ఫీమేట్ సింగర్ గా నిలిచారు. సత్య, వెన్నెల కిశోర్ బెస్ట్ కమేడియన్ అవార్డు సంయుక్తంగా అందుకోనున్నారు.

ఇవేకాకుండా వివిధ విభాగాలకు గానూ అవార్డులు ప్రకటించారు జ్యూరీ మెంబర్స్. జూన్ 14న హైటెక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఈ గద్దర్ అవార్డులన అందించనుంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions