Friday 25th July 2025
12:07:03 PM
Home > తాజా > నీటి కొరతతో ఓయూ హాస్టల్ మూసివేత.. కేసీఆర్ ఫైర్!

నీటి కొరతతో ఓయూ హాస్టల్ మూసివేత.. కేసీఆర్ ఫైర్!

kcr news

OU Hostel Closed | నీరు మరియు విద్యుత్ కొరత మూలంగా మే 1 నుండి 31 మే వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని హాస్టల్స్ మరియు మెస్ లను మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన విడుదల చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం, బీఆరెస్ సుప్రిమో కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో గత 4 నెలలుగా విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం (CM) ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని విమర్శించారు గులాబీ అధినేత.

ఉస్మానియా చీఫ్ వార్డెన్ నోటీస్ తో ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమని చెప్పారు కేసీఆర్. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
ఇందిరా గాంధీ రికార్డు బ్రేక్ చేసిన నరేంద్రమోదీ
WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి
‘అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ ఉద్యమించారు’
‘చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions