Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > కర్నూలు విషాదం..మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

కర్నూలు విషాదం..మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Minister Ponnam Prabhakar about Kurnool Bus Accident | కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయిన విషాద ఘటన అనేక ప్రశ్నలను లెవనెత్తుతుంది. ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్, సేఫ్టీ పై అనుమానాలను తలెత్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బస్సుల తనిఖీలు లేకపోవడం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే బస్సులను రోజూ తనిఖీలు చేస్తే వేధింపులు అని అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కర్నూలులో బస్సు దగ్ధం అయిన ఘటన దురదృష్టకరం అని, చాలా బాధ కలుగుతున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.

బస్సుల వేగాన్ని నియంత్రించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కర్నూలు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు చెప్పారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రుల, ఆ శాఖ కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions