- ఆమిర్ ఖాన్ వైరల్ వీడియోపై నెటిజన్లు ఫిదా!
Aamir Khan Car Video With Ex Wives And Girl Friend | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఎల్లప్పుడూ తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆమిర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలు, అలాగే త్వరలో కాబోయే భార్యతో కలిసి ఒకే కారులో ప్రయాణించడం చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘లగాన్’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అరుదైన దృశ్యం..
భారతీయ చలనచిత్ర చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిన ‘లగాన్’ (Lagaan) సినిమా విడుదలై విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను ముంబయిలో ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రత్యేక వేడుకకు ఆమిర్ ఖాన్ మొదటి మాజీ భార్య రీనా దత్తా, రెండవ మాజీ భార్య కిరణ్ రావుతో పాటు, త్వరలోనే ఆమిర్ సతీమణి కాబోతున్న ఆయన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్ర్యాట్ (Gauri Spratt) కూడా హాజరయ్యారు.
ఒకే కారులో ముగ్గురు..
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆమిర్ ఖాన్ వీరందరితో కలిసి ఒకే కారులో బయలుదేరారు. కారులో ఆమిర్ ఖాన్ డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చోగా, వెనుక సీట్లో రీనా దత్తా, కిరణ్ రావు, గౌరీ స్ప్ర్యాట్ కూర్చున్నారు. వీరితో పాటు కిరణ్ రావు-ఆమిర్ల కుమారుడు ఆజాద్ రావు కూడా ఉన్నాడు.
వైరల్ వీడియో.. నెటిజన్ల ప్రశంసలు..
కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమిర్ మాజీ భార్యలు, కాబోయే సతీమణి ఒకరితో ఒకరు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ కనిపించడం విశేషం.
సాధారణంగా విడాకుల తర్వాత దంపతుల మధ్య దూరం పెరుగుతుంది, కానీ ఆమిర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో ఇప్పటికీ ఎంతో గౌరవప్రదమైన, స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.
ఈ అరుదైన దృశ్యంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇలాంటి బంధాలు మెయింటైన్ చేయడం కేవలం ఆమిర్ ఖాన్‌కే సాధ్యం”, “నిజంగా ఇది ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌కు నిదర్శనం” అంటూ కొందరు అభినందిస్తుండగా, మరికొందరు “యే రిష్తా క్యా కెహలాతా హై” అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.







