Wednesday 3rd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్నూలు విషాదం..పరిహారం ప్రకటించిన ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు విషాదం..పరిహారం ప్రకటించిన ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం

Ex-Gratia For Victims Of Kurnool Bus Accident | కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్దమైన ఘటనలో 19 మంది సజీవదహనం అవ్వడం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. బస్సు బైక్ ను ఢీ కొట్టడం, ఆ తర్వాత బైక్ బస్సు కిందకు చొచ్చుకుని రావడంతో అగ్ని ప్రమాదానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు ప్రధాని.

‘ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

మరోవైపు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions