Tuesday 21st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మా నాన్న జ్వరంతో బాధపడటం చూడలేదు: మంత్రి లోకేశ్!

మా నాన్న జ్వరంతో బాధపడటం చూడలేదు: మంత్రి లోకేశ్!

  • “‘మన ఇల్లు – మన లోకేశ్’ లో నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nara Lokesh about CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్ విద్యుత్, ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ సుమారు 3,000 మంది నిరుపేదలకు ఉచిత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. నిరుపేదల చేతికి దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తులను ఇళ్ల పట్టాల రూపంలో అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

ఈ పట్టాల పంపిణీ సభలో మాట్లాడిన మంత్రి లోకేశ్, తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) నిరంతర శ్రమ, అంకితభావం గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు సభను ఆకట్టుకున్నాయి.

“మా నాన్నకు విశ్రాంతి అంటే తెలియదు”

తన తండ్రి చంద్రబాబు నాయుడి పనితీరును, ఆరోగ్య దృఢత్వాన్ని లోకేశ్ ఎంతో గర్వంగా కొనియాడారు: “నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న ఒక్క రోజు కూడా జ్వరం వచ్చి ఇంట్లో పడుకోవడం నేను చూడలేదు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుగ్గా పని చేస్తారు.

ఎప్పుడూ అలసటగా ఉందని కానీ, ఆరోగ్యం బాగాలేదని కానీ ఆయన అనడం నేను వినలేదు. ఎప్పుడూ ‘కష్టపడాలిరా’ అని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందడుగు వేయిస్తారు.” అని నారా లోకేశ్ తెలిపారు.

“ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నా”

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై తనకున్న కసిని, విజన్‌ను లోకేశ్ స్పష్టంగా వివరించారు. ఇవాళ పేదలకు అందించిన శాశ్వత భూపట్టాలతో వారి ఆస్తిని భవిష్యత్తులో ఎవరూ కదిలించలేరని, ఇది నిరుపేదల జీవితాలకు ఆర్థిక భద్రతనిస్తుందని అన్నారు.

2019 ఎన్నికల్లో తాను మంగళగిరిలో ఓడిపోయినప్పుడు కొందరు తన తండ్రి చంద్రబాబును కూడా తీవ్రంగా అవహేళన చేశారని, ఆ కసితోనే మంగళగిరిని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నెంబర్-1 నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

You may also like
ap cm
సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!
chandra babu
CM Chandrababu: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.. ఎన్ని పోస్టులంటే!
rgv at vyooham meet
చంద్రబాబంటే నాకు రసగుల్లా అంత ఇష్టం: ఆర్జీవీ కామెంట్స్!
cbn
‘తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కోరుకున్నా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions