- ప్రధాని 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానంపై ప్రశంసలు
Chandrababu Naidu Article PM Modi 25 Years ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం భారతదేశ పరివర్తనను, పెరుగుతున్న జాతీయ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కొనియాడారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా కొనసాగుతున్న మోదీ, అక్టోబర్ 7న పాలనాధిపతిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ది హిందూ’ పత్రికలో రాసిన ఒక ప్రత్యేక అభిప్రాయ వ్యాసంలో చంద్రబాబు తన విశ్లేషణను పంచుకున్నారు.
నాయకత్వమే ముఖ్యం..
“నా 48 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో ప్రభుత్వాలు మారడం, ఆర్థిక వ్యవస్థలు రూపాంతరం చెందడం చూశాను. అయితే నాయకత్వమే సర్వస్వం అనే పాఠం కాలంతో పాటు మరింత స్పష్టమైంది” అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రస్థానం స్పష్టమైన దార్శనికత, నిజాయితీ, క్రమశిక్షణ, ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ మరియు అమలు చేసే అద్భుత సామర్థ్యంతో సాగిందని కొనియాడారు.
సవాళ్లను దాటి ప్రగతి..
కోవిడ్-19 మహమ్మారి, అంతర్జాతీయ యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం దృఢంగా నిలబడిందని, అపూర్వ వేగంతో మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాలు, సాంకేతికతను ముందుకు తీసుకెళ్లామని ‘X’ పోస్ట్‌లో తెలిపారు.
కేవలం ఢిల్లీ నుండే మార్పు సాధ్యం కాదని నమ్మిన మోదీకి ‘టీమ్ ఇండియా’ భావనపై ప్రగాఢ విశ్వాసం ఉందని ప్రశంసించారు.ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ట: ప్రపంచ శక్తి కేంద్రాలతో సంబంధాలు కొనసాగిస్తూనే భారతదేశం తన జాతీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటోందని స్పష్టం చేశారు.











