Monday 9th December 2024
12:07:03 PM
Home > తాజా > తెలుగు హీరోపై నటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

తెలుగు హీరోపై నటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

Actress Vichitra

Vichitra Comments On Tollywood Hero | కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర (Actress Vichitra) సంచలన ఆరోపణలు చేశారు.

తమిళ బిగ్ బాస్ (Tamil Bigg Boss) ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె ఓ టాస్క్ లో మాట్లాడుతూ తను కూడా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు ఎదుర్కున్నట్లు తెలిపారు.

2001లో ఒక తెలుగు సినిమాలో (Tollywood) నటిస్తున్నప్పుడు తనకు కాస్టింగ్ కౌచ్ (Casting Couch) అనుభవం ఎదురైందని. ఆ సినిమాలో నటించిన ఒక స్టార్ హీరో తనను రూమ్ కు రమ్మన్నారని ఆరోపించారు విచిత్ర.

ఆ మాట విని షాక్ కు గురయ్యాననీ, తనకు ఏమి అర్ధం కాలేదని పేర్కొన్నారు. హీరో గదికి వెళ్లకపోవడంతో మరుసటి రోజు నుండి షూటింగ్ లో తీవ్ర సమస్యలను, వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు విచిత్ర.

ఆఖరికి డైరెక్టర్ కు చెప్పినా కూడా తనను చెంప మీద కొట్టినట్లు, అంతే కాకుండా షూటింగ్ సమయంలో ఆ టాప్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారామె.

ఈ ఘటన తర్వాత సినిమాల మీద ఆసక్తి పోయిందని, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, తెలుగులో విచిత్ర చివరి చిత్రం భలేవాడివి బాసు (Balevadivi Basu). ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions