Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > చట్నీలో ఎలుక పరుగులు..రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్!

చట్నీలో ఎలుక పరుగులు..రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్!

ktr

KTR Slams Congress Govt | సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లోని జేఎన్టీయూ కాలేజి హాస్టల్ లో చట్నీ పాత్రలో ఎలుక పరుగులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమన్నారు మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
‘“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారు..
మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు.
ఆనాటి కాంగ్రెస్ పాలనలో..
ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..
పురుగుల అన్నం.. నీళ్ల చారు..
ఈనాటి కాంగ్రెస్ పాలనలో..
ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి..
బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు’ అంటూ నిప్పులుచేరిగారు కేటీఆర్. ‘ సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్ లో
చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలు

ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు ??
అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ ???

కలుషిత ఆహారం వల్ల…
పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారు ‘ అని ధ్వజమెత్తారు

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions