Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆ మాటలు బాధించాయి.. కానీ క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!

ఆ మాటలు బాధించాయి.. కానీ క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!

  • జంతర్ మంతర్ ఘటనపై ప్రధాని భావోద్వేగ సందేశం

PM Modi Forgives Jantar Mantar Protesters | ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన సందర్భంగా తనపై, తన దివంగత తల్లిపై అత్యంత అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించిన యువ నిరసనకారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.  తనపై తన తల్లిపై అసభ్యకరంగా దూషించిన వారిని తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నట్లు ప్రకటించారు మోదీ.

దారితప్పిన యువతను శిక్షించడం, కోర్టులకు లాగడం కాకుండా వారికి సరైన మార్గదర్శనం చేయాలని సమాజానికి, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

“తిట్లు ఎప్పుడూ దేనినీ పరిష్కరించవు. దారి తప్పిన వారికి మార్గనిర్దేశం చేద్దాం. కలిసి పనిచేద్దాం. భారత్ కోసం పనిచేద్దాం.” అని పేర్కొన్నారు.

నా తల్లిపై దూషణలు నన్ను తీవ్రంగా బాధించాయి”:

వీడియో సందేశంలో ప్రధాని మోదీ జంతర్ మంతర్ ఘటనను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “జంతర్ మంతర్ వద్ద జరిగిన దాన్ని దేశం, ప్రపంచం చూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు అత్యంత దూషణాత్మక భాషను ఉపయోగించారు.

వారు నన్ను దూషించారు, నా దివంగత తల్లిని కూడా దూషించారు. ఇది చాలా కలవరపరిచే విషయం. సమాజంలోని ఆగ్రహాన్ని నేను చాలా బాగా అర్థం చేసుకోగలను. ఇది మన సాంస్కృతిక సమస్య.

 అయినప్పటికీ, కోపం లేదా శిక్షే సమాధానం కాదని నేను నమ్ముతున్నాను. పిల్లలు ఎదుగుతున్నప్పుడు తప్పులు చేస్తారు, ఆ తప్పుల నుండి నేర్చుకోవడానికి వారికి అవకాశం ఇవ్వాలి. నన్ను దూషించిన వారిని నేను క్షమిస్తున్నాను. నా ఈ నిర్ణయాన్ని సమాజం కూడా అంగీకరించాలని కోరుతున్నాను.” అని మోదీ వ్యాఖ్యానించారు.

క్షమాపణపై ప్రధాని చెప్పిన వినూత్న ఉపమానం..

యువతకు మార్గనిర్దేశం చేయడం మరియు క్షమించడం ఎందుకు ముఖ్యమో ప్రధాని ఒక వినూత్నమైన ఉపమానంతో వివరించారు.”కొన్నిసార్లు మన నాలుక పళ్ళ కిందకి వస్తుంది.. రక్తం కారుతుంది. కానీ అంతమాత్రాన మనం మన పళ్ళను విరగ్గొట్టుకోము కదా!

ఎందుకంటే ఆ పళ్ళు మనవే.. నాలుక కూడా మనదే! అలాగే మన పిల్లలు కూడా మనవారే. దారితప్పిన బిడ్డకు మార్గం చూపించడం కష్టమైన పనే, కానీ ఆ కష్టమైన పనిని సమాజంగా మనం చేయాల్సిందే.” అని తెలిపారు.

పిల్లలు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, కలలను సాకారం చేసుకుంటూ దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని, తాను వారి ఉజ్వల భవిష్యత్తు కోసమే నిరంతరం శ్రమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

You may also like
రూ. 5,000 కోట్ల ఆస్తి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే.. బిచ్చగాడిలా మారి..!
నాతో కలిసి సాయం చెయ్ సోదరా.. విమర్శలకు సూద్ స్వీట్ రిప్లై!
అర్ధరాత్రి మహిళను రైలు నుంచి దించేసిన రైల్వే.. రూ. 2 లక్షల ఫైన్!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions