Monday 11th August 2025
12:07:03 PM
Home > తాజా > KBK Group ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం!

KBK Group ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం!

blood donation by kbk group
  • ఉప్పల్ లోని కేబీకే గ్రూప్ కార్యాలయంలో జూలై 27న శిబిరం
  • యువత పెద్ద ఎత్తున పాల్గొని కేబీకే గ్రూప్ యాజమాన్యం విజ్ఞప్తి

హైదరాబాద్: రక్తహీనతకు కారణమవుతున్న తలసేమియా వ్యాధితో నిత్యం కోట్ల మంది చిన్నారులు జీవన పోరాటం చేస్తున్నారు. తరచూ రక్త మార్పిడి చేయించుకుంటూ రేపటి రక్త దాత కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి చిన్నారుల ఎదురు చూపులకు తన వంతు సాయం చేసేందుకు నడుం బిగించింది కేబీకే గ్రూప్. తలసేమియా పిల్లల ప్రాణ రక్షణకు ఉడతా సాయం చేసే సంకల్పంతో రక్తదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్త దాతల కోసం ఎదురు చూస్తున్న తలసేమియా చిన్నారుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తోంది. జూలై 27న ఉప్పల్ లో కేబీకే గ్రూప్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించనుంది. పసి బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కేబీకే గ్రూప్ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. రక్తదానం చేయాలనుకునే వారు  https://www.kbk.group/register-for-blood-donation-camp.php లింక్ క్లిక్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోగలరు.

You may also like
రజిని ‘కూలీ’ మేనియా..సెలవు ప్రకటించిన కంపెనీ
నిధి అగర్వాల్ కోసం ప్రభుత్వ వాహనం..క్లారిటీ ఇచ్చిన నటి
పాక్ అణు బెదిరింపు..ఆగ్రహించిన భారత్
పర్యాటకుడిని కాళ్ళతో తొక్కి దాడి చేసిన ఏనుగు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions