Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘మంత్రి పదవి హామీ నిజమే’..భట్టికి కోమటిరెడ్డి ధన్యవాదాలు

‘మంత్రి పదవి హామీ నిజమే’..భట్టికి కోమటిరెడ్డి ధన్యవాదాలు

Komatireddy Rajgopal Reddy News | మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

కానీ మంత్రివర్గ కూర్పులో సమీకరణాల కారణంగానే ఆయనకు మంత్రి పదవి ఇంకా రాలేదని చెప్పారు. భట్టి వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా రాష్ట్ర ముఖ్య‌ నేత‌లు అడ్డుకుంటూ, అవ‌మానిస్తున్న‌ వాస్త‌వాన్ని మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన భట్టికి ధన్యవాదాలు అని తెలిపారు కోమటిరెడ్డి.

తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని పేర్కొన్నారు. ప్రజలు త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, అవినీతి ర‌హిత‌ పాల‌న అందించాల‌ని కోరుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions