Saturday 1st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు’

‘సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు’

MLC Nagababu Meets CM Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో కలిశారు జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు. శాసన మండలి చైర్మన్ సమక్షంలో బుధవారం ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు నాగబాబు.

అనంతరం తన సతీమణి పద్మజతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాగబాబును చంద్రబాబు అభినందించారు. శాలువాతో నాగబాబును సత్కరించిన సీఎం శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నాగబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెల్సిందే.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions