Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > ఒక్కటైన కాంగ్రెస్-బీజేపీ

ఒక్కటైన కాంగ్రెస్-బీజేపీ

Congress Bjp Alliance In Aliabad Municipality | తెలంగాణ మున్సిపాలిటీల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలు, నిత్యం విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ ఓ మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం ఏకం అవ్వడం ఆసక్తిగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఈ వింత పొత్తు కుదిరింది.

మొత్తం 20 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆరెస్ 7, బీజేపీ 3, ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు. ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆరెస్ తీవ్రంగా శ్రమించాయి. అయితే మంగళవారం జరిగిన ఛైర్ పర్సన్ ఎన్నికలో బీజేపీ, ఇతరులు మద్దతు తెలపడంతో ఈ మున్సిపాలిటీ హస్త గతం అయ్యింది. దింతో మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన కంఠం శిరీష ఎన్నికయ్యారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions