Friday 5th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీకి ‘శ్రీలంక మిత్ర విభూషణ’

ప్రధాని మోదీకి ‘శ్రీలంక మిత్ర విభూషణ’

PM Modi conferred the Mithra Vibhushana medal by Sri Lankan government | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘శ్రీలంక మిత్ర విభూషణ్’ పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించింది. ప్రధాని మోదీ శనివారం శ్రీలంక దేశంలో పర్యటించారు.

ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక మోదీకి మిత్ర విభూషన్ మెడల్ ను అందజేశారు. భారతదేశం మరియు శ్రీలంక మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, అలాగే రెండు దేశాల సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సాహించడంలో మోదీ చూపిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, అధ్యక్షుడు దిసానాయక చేతుల మీదుగా ‘శ్రీలంక మిత్ర విభూషణ్’ పురస్కారంతో తనను సత్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల భారతీయులకు లభించిన సన్మానమని పేర్కొన్నారు. ఇది భారతదేశం మరియు శ్రీలంక ప్రజల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను, స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనమన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions