Thursday 3rd September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ముంబైలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతకు సన్మానం

ముంబైలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతకు సన్మానం

Telangana Congress leader honored in Mumbai

నిజామాబాద్‌:ముంబైలోని ప్రముఖ సంస్థఐన భారతీయ సమాజ్‌ సేవ సమితి మాదిగ (రిజి) అధ్వర్యంలో వడాల ప్రాంతం ఆఫీస్‌ లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రం నుంచి విచ్చేసిన జిల్లా నారాయణపేట నర్వ మండలం మాజీ సర్పంచ్‌ బంగ్లాలక్ష్మి శ్రీకాంత్‌ రెడ్డికి ఘనంగా సన్మానించారు. ఇతనే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున మక్తల్‌ నియోజక వర్గం నుంచి పోటీలో ఉండిన వాకిటి శ్రీహరిని ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అట్టి క్రియశీల శ్రీకాంత్‌ రెడ్డికి నేత్తిపై పేట ధరించి, షాల్వా కప్పి, చేతిలో పుష్ప గుచ్ఛం ఇచ్చి మాదిగ సమాజం ఘనంగా సన్మానించారు. ఆరంభంలో విచ్చేసిన అథితులు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ‘‘సమితి’’ అధ్యక్షులు గోవింద్‌ సగ్యలోలు, కార్యదర్శి గురునాథ్‌ కేదాస్‌, బాబు మాత్రే, ప్యాట శివప్ప, సాయన్న మాత్రే వారికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడు తూ తమ కన్న భూమి ప్రాంత నేత యొక్క రాజకీయ శ్రమను గుర్తించి, ఫూలే షాహు అంబేడ్కర్ల పోరాట గడ్డఐన మహారాష్ట్రలో సన్మానించి నందుకు తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions