KTR Helps Sircilla Student IIT Madras Fees | ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నాయిని రిత్విక్ అనే విద్యార్థి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాస్ (IIT Madras) లో సీటు సాధించాడు.
అయితే, పైచదువులకు అయ్యే ఫీజులు కట్టలేని ఆర్థిక పరిస్థితిలో ఆ కుటుంబం ఉండటంతో, ఈ విషయం కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, సదరు విద్యార్థి రిత్విక్‌ను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడారు.
“బాధపడకు రా… నీ ఫీజు నేను కడతా” అంటూ ఆ యువకుడి భుజం తట్టి కొండంత భరోసా ఇచ్చారు.
‘గిఫ్ట్ ఎ స్మైల్’ కింద ల్యాప్‌టాప్ పంపిణీ..
ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడేలా తన సొంత కార్యక్రమం ‘గిఫ్ట్ ఎ స్మైల్’ (Gift A Smile) కింద రిత్విక్‌కు ఒక అధునాతన ల్యాప్‌టాప్‌ను కేటీఆర్ స్వయంగా అందజేశారు.
దాంతో పాటు, ఐఐటీ మద్రాస్‌లో అతను చదువు పూర్తి చేయడానికి అయ్యే మొత్తం ఫీజు బాధ్యతను తానే వ్యక్తిగతంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
కష్టాల్లో ఉన్న ఒక ప్రతిభావంతుడైన విద్యార్థికి సరైన సమయంలో కేటీఆర్ అందించిన ఈ సాయం పట్ల నెటిజన్లు, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ చూపిన ఈ చొరవతో రిత్విక్ కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







