Friday 18th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ’

‘వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ’

‘Only PM Modi works 100 hours a week’ | తనకు తెలిసి వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పినట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించారు.

ఈ మేరకు తేజస్వి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ముంబయి నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో నారాయణమూర్తితో కలిసి ప్రయాణించినట్లు బీజేపీ ఎంపీ తెలిపారు. ఉపాధి నైపుణ్యాలు, ఏఐ, నగరాల ప్రస్తుత స్థితి, నాయకత్వం ఇలా పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ‘మీరు చెప్పిన విధంగానే వారానికి 70 గంటలు పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నారాయణమూర్తితో సరదాగా చెప్పినట్లు తేజస్వి సూర్య చెప్పారు. ఈ సమయంలో స్పందించిన నారాయణమూర్తి ‘తనకు తెలిసి వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీనే’ అని ఆయన కితాబిచ్చరని బీజేపీ ఎంపీ పోస్ట్ చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions