Friday 30th October 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్‌కు నీటి గండం: రాబోయే 8 నెలలు తీవ్ర నీటి కష్టాలు!

హైదరాబాద్‌కు నీటి గండం: రాబోయే 8 నెలలు తీవ్ర నీటి కష్టాలు!

  • జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కీలక ప్రకటన!

Hyd To Face Water Scarcity Next 8 Months భాగ్యనగర వాసులకు రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకానుంది. నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలు అడుగంటిపోవడంతో రాబోయే ఎనిమిది నెలల పాటు తీవ్ర నీటి కష్టాలు తప్పవని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో నగరానికి రోజువారీ సరఫరాలో సుమారు 100 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటి కొరత ఏర్పడనుందని ఆయన వెల్లడించారు. ఈ నీటి సంక్షోభ ప్రభావం వచ్చే ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరించారు.

ముంచుకొస్తున్న జలసంక్షోభం..

జలాశయాల్లో ప్రాజెక్టు మట్టాలు దారుణంగా పడిపోవడం, వర్షపాతం లోటు వల్ల భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నగరంలో నీటి కొరత తీవ్రరూపం దాల్చిందని అశోక్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఈ ప్రభావం స్పష్టంగా పడనుందన్నారు.

ప్రత్యామ్నాయ ప్రణాళికలు..

నీటి ఎద్దడి నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు జలమండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసింది. గోదావరి నుంచి 100 MGD ల నీటిని, కృష్ణా నది నుంచి 10 నుండి 15 MGD ల నీటిని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ నుంచి మరో 5 MGD ల నీటిని నగరానికి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ చర్యల ద్వారా మొత్తం కొరతలో 60 శాతం వరకు భర్తీ చేయగలిగినప్పటికీ, మిగతా 20 నుండి 40 శాతం నీటి కొరత తప్పక కొనసాగుతుందని ఎండీ అశోక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఏడు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం..

ఈ జలసంక్షోభ ప్రభావం నగరంలోని ఏడు ప్రధాన నియోజకవర్గాలపై అధికంగా ఉండనుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏకంగా 80 శాతం వరకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పటాన్‌చెరు నుండి నార్సింగి వరకు పరిధిలో ఉన్న సుమారు 3 లక్షల కనెక్షన్లకు నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నందున రాబోయే రోజుల్లో ప్రజలంతా నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయకుండా సహకరించాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

You may also like
Metro
Hyd మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రద్దీ చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం!
గణేష్ ఊరేగింపులో మాంసం వ్యర్థాలు విసిరిన ముగ్గురు అరెస్టు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions