Monday 20th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఆ అవార్డును మీ పాదాల దగ్గర ఉంచి..’ రాధిక శరత్ కుమార్ ఎమోషనల్ పోస్ట్!

‘ఆ అవార్డును మీ పాదాల దగ్గర ఉంచి..’ రాధిక శరత్ కుమార్ ఎమోషనల్ పోస్ట్!

radhika sharath kumar

Radhika’s Emotional Post On Bharati Raja | తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండరీ దర్శకుడిగా పేరుగాంచిన భారతీరాజా (84) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, తాజాగా రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) సినిమాను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం రాధిక గారు ఆయనను పలకరించేందుకు వెళ్లారు.

వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.రాధిక నటనను చూసి ముగ్ధుడైన భారతీరాజా.. “ఈ సినిమాలో నీ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది” అని జోస్యం చెప్పారు.

ఆయన మాటలకు ఆశ్చర్యపోయిన రాధిక.. “ఒకవేళ నాకు అవార్డు వస్తే, దానిని మీ పాదాల చెంత ఉంచి అంకితం చేస్తాను” అని భావోద్వేగంతో సమాధానమిచ్చారు.

భారతీరాజా ఆరోగ్య పరిస్థితిపై రాధిక ఆవేదన వ్యక్తం చేస్తూ.. “ఆయన్ని ఇలా చూడటం నాకు ఇష్టం లేదు, కానీ ఆయనను నడిపిస్తున్నది కేవలం సినిమాపై ఉన్న ప్రేమే” అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions