Saturday 31st October 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బిడ్డ పెళ్లి వేదిక మార్పు.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్!

బిడ్డ పెళ్లి వేదిక మార్పు.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్!

sharmila
  • యలహంక నివాసంలో వివాహం రద్దు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబాల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదాల నడుమ షర్మిల కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేదిక మారింది. బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన పెళ్లిని వేరే ప్రదేశానికి మారుస్తున్నట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ లేఖను విడుదల చేశారు.

యలహంక ఇల్లు నా బిడ్డల హక్కే..

“నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు” అని షర్మిల తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆస్తుల పంపకాల ఒప్పందంలో భాగంగా అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ పూర్తిగా 100 శాతం తన, తన పిల్లల భాగానికి వచ్చిందని, ఇది దేవుడి సాక్షిగా నిజమని ఆమె పేర్కొన్నారు.

దివంగత మహానేత వైఎస్సార్ తిరిగిన ఇల్లు, తాను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు కావడంతో అంజలి తన పెళ్లిని యలహంక నివాసంలోనే జరిపించాలని కోరుకుందని తెలిపారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి జరిపించడం ప్రతీ తల్లిదండ్రులకు అదృష్టమని, కానీ మారుతున్న పరిణామాల వల్ల బిడ్డ ఆశను నెరవేర్చలేక పోయామని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

వివాద రహితంగా వివాహం..

పెళ్లి వేదిక విషయంలో జరుగుతున్న రచ్చపై స్పందిస్తూ.. “పెద్దలు కుదిర్చిన ఈ సంబంధాన్ని ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా ప్రశాంతంగా జరిపించాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే యలహంక ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిశ్చయించిన ప్రకారం వివాహం జరిపిస్తున్నాం” అని తెలిపారు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజలందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఆమె కోరారు.

You may also like
pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన విజ్ఞప్తితో ఈ గుర్తుల తొలగింపు!
తమిళనాడు సీఎం విజయ్‌కి వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి పిలుపు!
sharmila
ఈసారైనా కట్టేనా.. లేక మళ్లీ మట్టేనా: ప్రధాని పర్యటనపై షర్మిల కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions