Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > ఐపీఎస్ – ఐఏఎస్ పెళ్లి.. ఆదర్శం అందరికీ!

ఐపీఎస్ – ఐఏఎస్ పెళ్లి.. ఆదర్శం అందరికీ!

ias and ips couple

IPS-IAS Simple Wedding | రూ.లక్షల్లో జీతభత్యాలు ఉన్నప్పటికీ నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు అత్యంత ఉన్నత హోదాలో ఉన్న ఈ అధికారులు. హంగూఆర్భాటం లేకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు ఈ ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి మరియు కడప జిల్లాకు ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి తాజగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి అత్యంత సాధారణంగా జరిగింది.

కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో చౌటుప్పల్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వివాహ కార్యక్రమం జరిగింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్న ఈ జంటను అందరూ అభినందిస్తున్నారు. ఇకపోతే శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా, శ్రీకాంత్ రెడ్డి ట్రైనీ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions