Saturday 15th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహిళా ఎంపీ మెడలోని గొలుసును కొట్టేసిన దొంగ

మహిళా ఎంపీ మెడలోని గొలుసును కొట్టేసిన దొంగ

Congress MP Sudha’s Gold Chain Snatched In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా ఎంపీకి షాకింగ్ ఘటన ఎదురైంది.

మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ దొంగ తన మెడలోని గొలుసును లాక్కొని పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమిళనాడుకు చెందిన ఎంపీ, కాంగ్రెస్ నేత సుధా రామకృష్ణన్.

తమిళనాడు మయిలాదుతురై నుంచి లోక్‌సభ సభ్యురాలైన సుధా రామకృష్ణన్, ఈ ఘటన చాణక్యపురిలోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని పోలండ్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగినట్లు సోమవారం ఉదయం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తోటి ఎంపీ, డీఎంకే సభ్యురాలు రజతితో కలిసి నడుస్తుండగా ఓ దొంగ తన గొలుసును లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సదరు ఎంపీ ఓ లేఖ రాశారు.

కట్టుదిట్టమైన భద్రత ఉండే చాణక్యపురి వంటి ప్రాంతంలో పార్లమెంటు సభ్యురాలికే రక్షణ లేకపోతే ఇక సాధారణ పౌరులకు రక్షణ ఎలా కల్పిస్తారని అమిత్ షాకు రాసిన లేఖలో ఎంపీ సుధా రామకృష్ణన్ పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions