Sunday 20th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస!

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస!

Actor Pradeep Rawat Passes Away | ‘లగాన్’, ‘గజినీ’ వంటి విభిన్న చిత్రాలలో ప్రతికూల (విలన్), సహాయ పాత్రలతో తీవ్ర ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత ఐదేళ్లుగా రక్త క్యాన్సర్‌తో (Blood Cancer) పోరాడుతున్న ఆయన, భివండిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణవార్తను బిజినెస్ మేనేజర్ సిద్ధార్థ్ తివారీ ధృవీకరించారు. గత కొన్ని నెలల క్రితం క్యాన్సర్ తిరగబెట్టడంతో ఆయన రెండు నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్నారని, గత కొన్ని రోజులుగా పరిస్థితి విషమించి మంగళవారం మరణించారని తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశం ఉందన్నారు.

‘మహాభారత్’ తో పరిచయం..

జనవరి 21, 1952న జన్మించిన ప్రదీప్ రావత్, బి.ఆర్. చోప్రా ప్రసిద్ధ పౌరాణిక సీరియల్ ‘మహాభారత్’ లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఆస్కార్ నామినేషన్ పొందిన ‘లగాన్’ చిత్రంలో దేవా సింగ్ సోధిగా, అలాగే ‘గజినీ’ చిత్రంలో టైటిల్ రోల్ ‘గజినీ ధర్మాత్మ’గా ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి.

తెలుగు చిత్రసీమలో ‘సై’ సినిమాతో విలన్‌గా పరిచయమై సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తమిళం, కన్నడ (‘పరోడి’), మలయాళం (‘చైనా టౌన్’), బెంగాలీ (‘హీరో 420’), భోజ్‌పురి (‘క్రాక్ ఫైటర్’) భాషల్లోనూ అనేక విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసి మెప్పించారు.

సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి..

ప్రదీప్ రావత్ మరణంపై సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘లగాన్’లో ఆయనతో కలిసి నటించిన నటుడు యశ్‌పాల్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. “మన ‘గజనీ’, ‘లగాన్’ దేవా ప్రదీప్ రావత్ ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like
బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ’ ప్రభంజనం!
వివాహ ఆచారాలపై నటి నమిత బోల్డ్ కామెంట్స్: ఆన్‌లైన్‌లో జోరుగా చర్చ!
నటుడు ధనుష్ ఉదారత.. తాను చదువుకున్న స్కూల్ కు కానుకగా..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions