Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > N-CONVENTION..అప్పటివరకు ఎలాంటి పుకార్లు నమ్మకండి

N-CONVENTION..అప్పటివరకు ఎలాంటి పుకార్లు నమ్మకండి

nagarjuna akkineni

Nagarjuna On N Convention | హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ( N Convention ) ను హైడ్రా ( Hydra )అధికారులు శనివారం కూల్చివేశిన విషయం తెల్సిందే. ఇప్పటికే దీనిపై నాగార్జున ( Akkineni Nagarjuna ) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మరోవైపు ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని నాగార్జున కోరారు.

‘ N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing Act, ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను ‘ అని నాగార్జున పేర్కొన్నారు.

You may also like
ముంచేస్తున్న వరదలు..హైడ్రాపై నాగబాబు అభినందనలు
ఆంధ్రాలోనూ ‘హైడ్రా’..కూటమి నేతలు హాట్ కామెంట్స్
43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నాం : HYDRA
ftl and buffer zone
HYDRA దూకుడు.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటే ఏంటో తెలుసా?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions