KTR Pressmeet | ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) నుంచి సీపీ రాధాక్రిష్ణన్ (CP Radhakrishnan) , ఇండీ కూటమి (INDI Alliance) నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudershan Reddy) పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దుతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కేసీఆర్ ను మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆయన కీలక వ్యాఖ్యల చేశారు. ఈ ఎన్నికలో జరగేదంతా ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి బీసీ బిడ్డను ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ నోటి మీదేనా.. చేతల్లో ఉండదా అని నిలదీశారు. తాము ఏ కూటమిలో లేమనీ, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమల్ని సంప్రదించలేదని తెలిపారు.
‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు.. మోదీ మా బాస్ కాదు. తెలంగాణ ప్రజలే మా బాస్. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తెస్తారో వారికే మా మద్దతు’ అని పేర్కొన్నారు కేటీఆర్. ప్రస్తుతం బీఆరెస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.











